ఈ మధ్య ఏసీల వాడకం బాగా పెరిగిపోతోంది. ఈ ఎండ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా చాలా మంది ఏసీలు కొంటున్నారు. ఇంటికి రెండు ఏసీలు ఉంటున్న పరిస్దితులు కూడా చూస్తున్నాం. ఇక ప్రతీ కార్యాలయంలో కూడా సెంట్రల్ ఏసీ సిస్టం ఉంటోంది. గ్లోబల్ వార్మింగ్ కు ఏసీల వాడకం కూడా ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. 2018 నుంచి ఏసీల వాడకం ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది.
వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతోంది. మొత్తం వరల్డ్ లో చూసుకుంటే అన్నీ కంపెనీలవి కలిపి సుమారు 5.6 బిలియన్ యూనిట్ల ఎసి నడుస్తోంది. దీని వల్ల వేడి కూడా పెరుగుతోంది అంటున్నారు నిపుణులు. కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ వాడకం పెరిగింది. ఆఫీసుల్లో ఈ వాడకం ఎక్కువ ఉంటోంది ఇదే 60 శాతం ఎక్కువ వాడకంగా కనిపిస్తోంది.
అత్యధికంగా అమెరికాలో 44.3 శాతం గృహాలు ఇప్పుడు ఏసీతో నడుస్తున్నాయట. . ఎసి నుండి వెలువడే వాయువుల కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటుందంటున్నారు నిపుణులు.