ఈ భూమిపై మనుషులే కాదు ఎన్నో జంతువులు ఉన్నాయి. వాటికి కూడా ఈ భూమిపై జీవించే హక్కు ఉంది. ముఖ్యంగా పాముల గురించి చెప్పుకోవాలి. ఇందులో కొన్ని విషపు పాములు ఉన్నాయి. వీటిని చూడగానే వణుకు వస్తుంది. ప్రపంచంలో పాముల వల్ల ప్రతి సంవత్సరం సగటున 1,38,000 మంది చనిపోతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి.
ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఇన్లాండ్ తైపాన్, బ్లాక్ మాంబా, రస్సెల్ వైపర్, కింగ్ కోబ్రా, ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ వంటి జాతులు ఉన్నాయి. వీటి ఒక్క విషపు చుక్క మనిషిని నిమిషాల్లో చంపేస్తుంది. అయితే పాము గరిష్ట వయస్సు ఎంత, అసలు పాములు ఎంత కాలం జీవిస్తాయి అనేది తెలుసుకున్నారా.
అడవులలో స్వేచ్ఛగా నివసించే పాములు తక్కువ కాలం బతుకుతాయి.జంతుప్రదర్శనశాలలలో నివసించే పాములు ఎక్కువ కాలం బతుకుతాయి. అడవిలో ఉండేవి 10 నుంచి 12 ఏళ్లు బతుకుతాయి. ఇక జూలలో ఉండేవి 18 నుంచి 20 ఏళ్లు బతుకుతాయి.బాల్ పైథాన్ జాతుల పాములు 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటాయి.