ఆర్యన్‌కు బెయిల్‌ రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Do you know what happens if Aryan does not get bail?

0
106

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్‌ పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌ బెయిన్‌ను తిరస్కరించిన కోర్టు ఈసారైనా బెయిల్‌ మంజూరు చేస్తుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెల​కొంది.

నేడు ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. గత వారమే ఆర్యన్‌కు బెయిల్‌ వస్తుందని అంతా భావించినా కోర్టు షాకిచ్చింది. దీంతో ఈసారైనా బెయిల్‌ వస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది. ఆర్యన్‌కు బెయిల్‌ రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

ఆర్యన్‌కు ఈ వారంలో బెయిల్‌ రాకపోతే మాత్రం అతను మరో 14 రోజుల పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి ముంబై హైకోర్టుకు వరుసగా దీపావళి సెలవులు ఉన్నాయి. నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు ముంబై హైకోర్టుకు సెలవులు కావడంతో నేడు జరిగే విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే కొడుకు అరెస్ట్‌తో షారుక్‌ దంపతులు తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నట్లు సమాచారం. దీనితో ఇవాళ్టి విచారణ కీలకం కానుంది.