చిన్న పిల్లలే ఈ మహిళ టార్గెట్..ఏం చేస్తుందో తెలుసా?

Do you know what this woman is targeting with small children?

0
119

ఏపీ: రైల్లో ప్రయాణిస్తూ చిన్న పిల్లలను దొంగిలించి అమ్ముకుంటున్న దొంగను అరెస్టు చేశామని రాజమండ్రి రైల్వే పోలీస్ స్టేషన్ డిఎస్పి బివిఎస్. నాగేశ్వరరావు తెలిపారు. ఈనెల 29న విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో 18 నెలల పాపను అపహరించిన ప్రధాన ముద్దాయి ముళ్లపూడి భవానినీ అరెస్టు చేసి నిందితురాలు వద్దనుండి పాపను తల్లిదండ్రులకు అప్పచెప్పామని ఆయన తెలిపారు.

శనివారం రైల్వే పోలీస్ స్టేషన్లో ఆవరణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాజమండ్రి రూరల్ మండలం హుకుం పేట పంచాయతీ పరిధిలోని డి బ్లాక్ లో నివసించే ముళ్ళపూడి భవాని ఏలియాస్ మేఘన అనే మహిళ డబ్బుకు ఆశపడి పిల్లలను అపహరించేదని పథకం పన్నింది. ఇందుకు ఇదే ప్రాంతానికి చెందిన దంపతులు పొన్నాడ రామకృష్ణ పొన్నాడ వెంకట రత్నం నిందితురాలికు పరిచయం అయ్యాడు. తర్వాత వీరిద్దరూ పిల్లలు ఉంటే చూడమని పిల్లలు లేని దంపతులకు అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పడంతో నిందితురాలు మేఘన పిల్లల అపహరణకు పాల్పడిందని అన్నారు. ఈ క్రమంలో గత నెల 29న రాజమండ్రి నుండి విశాఖపట్నానికి రైల్లో వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో 30వ తేదీన విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆవరణలో నలుగురు పిల్లలతో కలిసి ఉన్న ఒడిశా చెందిన బాలిక తండ్రి సుభాష్ చత్రియ కుటుంబంతో మాటలు కలిపి వారితోపాటు హైదరాబాద్ కు ప్రయాణం చేసిందన్నారు.

మార్గమధ్యలో ఆ కుటుంబం నిద్ర పోవడంతో వారికి చెందిన 18 నెలల పాపను తీసుకుని రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగిపోయిందని డిఎస్పీ తెలిపారు. వెంటనే పాపను డి బ్లాక్ లోని పొన్నాడ రామకృష్ణ, వెంకటరత్నం దంపతులకు అప్పగించి పాపను ఎక్కువ ధరకు అమ్మిన తరువాత తన వాటా సొమ్మును తనకు ఇవ్వాలని చెప్పి వచ్చేసింది అన్నారు. అయితే పాపను కొనేందుకు ఎవరు సంప్రదించకపోవడం తో ఆ దంపతులు వద్దనే ఉంచినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విశాఖపట్నం రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, విశాఖపట్నం తదుపరి ప్రాంతంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

శనివారం రైల్వే స్టేషన్ సిఎపివి జయశంకర్ వచ్చిన సమాచారం మేరకు ఆర్ పి. ఎస్ఐలు, మావయ్య, శ్రీనివాస్ మహిళా సిబ్బంది ఫిర్యాదు దారుడు సుభాష్ చత్రియను వెంటబెట్టుకుని నిందితురాలు భవానిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇచ్చిన సమాచారం మేరకు పాపను దాచి ఉంచిన దంపతులను అరెస్టు చేశామని వీరు ముగ్గురిని రిమాండ్ కు తరలిస్తున్నారు. అనంతరం పాపను తల్లిదండ్రులకు డీఎస్పీ నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు అందజేశారు. 15 రోజుల్లోనే పాప అపహరణ కేసును ఛేదించిన పోలీసులని రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ అభినందించినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.