తాళికట్టిన తర్వాత కట్నం, బైక్ డిమాండ్ చేసిన వరుడు – చివరకు ఏమైందంటే

ఊరేగింపు చేపట్టే సమయంలో వరుడి తరపువారు కట్నకానుకలు డిమాండ్ చేశారట

0
115

ఇంకా కట్నాల కోసం వేధించే కుటుంబాలు ఈ రోజుల్లో కూడా చాలా ఉంటున్నాయి. అమ్మాయికి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఈ కట్నకానుకల కోసం ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో ఉన్నారు. అయితే మరికొందరు అమ్మాయి మా ఇంటికి వస్తే చాలు ఎలాంటి కట్నాలు వద్దు అంటున్నారు. కొందరు మాత్రం కట్నాల కోసం వేధించే వారు ఉంటున్నారు. ఏకంగా వివాహం అయిన తర్వాత కట్నం కోసం అమ్మాయిని మండపంలో వదిలివెళ్లారు ఈ వరుడి కుటుంబ సభ్యులు.

వివాహం అయింది, ఇక దండలు మార్చుకొని ఊరేగింపు ప్రారంభం అయ్యే క్రమంలో వరుడు షరతులు పెట్టాడు. బైక్, ఇంకా వరకట్నం కావాలంటూ డిమాండ్ చేశాడు. అప్పుడు ఆమెని ఇంటికి తీసుకువెళతాం అన్నారు, దీంతో తాను రైతుని అంత కట్నం ఇవ్వలేను అని అమ్మాయి తండ్రి చెప్పాడు, అయినా వరుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆ పేద రైతు కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్టెక్కారు.

రాజస్థాన్ లోని సీకర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఆ అమ్మాయి తండ్రి మాట్లాడుతూ తమ కుమార్తెకు జూలై 3న బుగాలా గ్రామానికి చెందిన అజయ్తో వివాహం జరిగిందని, పెళ్లితంతు అంతా పూర్తియ్యిందని, విందు కూడా ముగిసిందన్నాడు. ఊరేగింపు చేపట్టే సమయంలో వరుడి తరపువారు కట్నకానుకలు డిమాండ్ చేశారన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామన్నారు.