భర్త డ్రైవ‌ర్ 15 రోజుల‌కి ఓసారి ఇంటికి – భార్య ఎవ‌రితో అఫైర్ పెట్టుకుందంటే

Driver wife illegal affair with shop owner

0
122

అక్ర‌మ సంబంధాలు స‌క్ర‌మంగా ఉన్న జీవితాల‌ను నాశ‌నం చేస్తాయి. ఆ క్ష‌ణిక సుఖం కోసం వెంప‌ర్లాడి చ‌క్క‌ని జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్న వారు కొంద‌రు ఉంటున్నారు . ఏకంగా ప్రియుడి కోసం భ‌ర్త‌ని చంపాలి అని స్కెచ్ వేసింది భార్య‌. దక్షిణ ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్ ప్రాంతానికి చెందిన 45 యేళ్ళ బబిత, 48 యేళ్ళ భీమ్ రాజ్ చక్క‌ని కుటుంబం. వీరికి ఒక కుమార్తె ఉంది కుమార్తెకు పెళ్ళి చేసి పంపించేశారు.

భీమ్ రాజ్ ఓ కంపెనీలో కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటికి 15 రోజుల‌కి ఓసారి వ‌స్తాడు ఈ స‌మ‌యంలో బ‌బిత ఇంట్లో ఒంట‌రిగా ఉంటోంది. ఇంటి ద‌గ్గ‌ర ప్రొవిజన్ షాపు ఓనర్ రోషన్‌తో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.ఇంట్లో భ‌ర్త లేక‌పోవ‌డంతో ఇద్ద‌రూ ఎంజాయ్ చేసేవారు . ఇక భ‌ర్త అడ్డు తొల‌గించుకోవాలి అని ప్లాన్ వేశారు.

ప్రియుడు రోష‌న్ ప్లాన్ వేశాడు. ఒక తుపాకిని తీసుకొచ్చి నిద్రించేటప్పుడు కాల్చేయమని చెప్పాడు. ప్రియుడు చెప్పినట్లే నిద్రిస్తున్న భర్తను కాల్చి ఆ తరువాత పారిపోయింది. చివ‌ర‌కు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేసిన పోలీసుల‌కి భార్య ప్రియుడు ప్లాన్ వేశారు అని తెలిసింది. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు వీరిద్ద‌రూ.