Breaking News: బాలీవుడ్ లో సంచలనం..షారుక్ ఖాన్ కొడుకు అరెస్ట్

Drug abuse in Mumbai

0
157

ముంబయిలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ముంబయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు ఎన్‌సీబీ అధికారులు. సముద్రం మధ్యలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి 10 మందిని అరెస్ట్ చేచేశారు.

అరెస్ట్ అయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఉన్న లింకులపై ఎన్సీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్యన్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతడి కాల్స్ డేటాను, చాట్స్‌ను పరిశీలిస్తున్నారు.