డ్రగ్స్​ కేసు: టోనీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Drugs case: Police take Tony into custody

0
71

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీని  పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో  మరో 15 మంది వ్యాపారవేత్తలను గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్టు కూడా చేశారు. మరో ఇద్దరు వ్యాపారవేత్తలు గజేంద్ర, విపుల్ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా టోనీని హైదరాబాద్​ పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టోనీని పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. పంజాగుట్ట పీఎస్​కు తరలించి టోనీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో అసలు నిజాలు బయటపడనున్నాయి.