నైజీరియన్ డ్రగ్ డీలర్ టోనీ ఐదు రోజుల కస్టడీ ముగిసింది. పంజాగుట్ట పోలీసులు వైద్య పరీక్షలు అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి చంచల్ గూడా జైలుకు తరలించారు. 5 రోజుల పాటు టోనీని ప్రశ్నించిన పోలీసులు.. డ్రగ్స్ దందాపై కీలక విషయాలు రాబట్టారు. టోనీతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ప్రధాన ఏజెంట్ ఇమ్రాన్ భార్య ఫిర్దోస్ను కూడా అరెస్టు చేశారు.