డ్రగ్స్ కలకలం-ట్యాబ్లెట్ల రూపంలో..ఫొటో ఫ్రేమ్స్​లో..!

Drugs in the form of tablets - in photo frames ..!

0
88

హైదరాబాద్‌లో 14.2 కిలోల డ్రగ్స్‌ సూడో ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్​ సీపీ అంజినీకుమార్​ వెల్లడించారు. దీని విలువ సుమారు రూ.5.50 కోట్లు ఉంటుందన్నారు. మాత్రల రూపంలో వీటిని విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్​ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 100 మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ డ్రగ్స్​ విలువ ఒక కేజీ 41 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.

ఆస్ట్రేలియాకు పార్సిల్ చేసేందుకు..ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి ప్యాకింగ్ చేశారన్నారు. ఈ డ్రగ్స్‌ కొరియర్ సమాచారంతో.. బేగంపేట పోలీసులు, డీఆర్ఐ అధికారులు జాయింట్​ ఆపరేషన్​ నిర్వహించినట్లు సీపీ అంజనీకుమార్​ తెలిపారు. కొరియర్ కేంద్రంలో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.