తెలంగాణ సర్కార్ ఎన్ని చర్యలు తీసుకున్న డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. మాదకద్రవ్యాల దందా హైదరాబాద్ కె పరిమితం అనుకుంటే ఇప్పుడు ఇతర జిల్లాలల్లో దందా మొదలయింది. తాజాగా ఖమ్మంలో డ్రగ్స్ కలకలం రేపాయి. నగరానికి చెందిన యువకుల నుంచి 30 గ్రాముల డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన యువకుల నుంచి డ్రగ్స్‌తో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.