తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో ఓ అధికారి తన వక్రబుద్ధి చూపించాడు. పిల్లలకు మంచి చెడు చెప్పేది పోయి తనే పాడు పనికి పూనుకున్నాడు. వివరాల్లోకి వెళితే DTDO సాయంత్రం ఏడు గంటల తరువాత మంచిర్యాల బాలికల ఆశ్రమ పాఠశాలకు మద్యం సేవించి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలాడటం చేసాడు. దీనితో అక్కడ అమ్మాయిలు చాలా ధైర్యంగా మాకు ఈ అధికారి వద్దు అని నిరసన చేపట్టారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా నిరసన చేపట్టారు. ఇంకొంతమంది అధికారులు ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి పిల్లలను బెదిరించే ప్రయత్నం చాలా చేసినప్పటికీ వారు భయపడకుండా వెనక్కి తగ్గకుండా అదే విషయాన్ని ధైర్యంగా మీడియా, పోలీసుల ముందు వివరంగా చెప్పారు. వారికి మద్దతుగా టీఎస్ యుటిఎఫ్ మహిళా నాయకత్వం వెన్నంటి ఉంది.
ఈ కార్యక్రమంలో TSUTF జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి, జిల్లా ఉపాధ్యక్షురాలు లావణ్య, కాసిపేట మండల అధ్యక్షురాలు సునీత, జిల్లా కార్యవర్గ సభ్యులు లతా, జయప్రద వెళ్లి వారికి మనో ధైర్యాన్ని ఇచ్చి అండగా ఉంటామని తెలియజేస్తూ చొప్పున నిక్కచ్చిగా ఎదిరించిన వారి ధైర్యానికి అభినందించారు.
https://www.facebook.com/alltimereport/videos/605033000841248