ఏపీలో భూకంపం కలకలం రేపింది. నెల్లూరు, కడప జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూమి కుదుపులకు లోను కావడంతో జనం ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో, కడప జిల్లా బద్వేలు మండలంలోనూ భూమి కంపించిందని విద్యానగర్, చిన్నకేశంపల్లి గ్రామస్థులు తెలిపారు. ఓ వైపు వర్షాలు మరోవైపు భూకంపంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు.