Eluru | నిత్యం వార్తల్లో సైబర్ నేరగాళ్ల గురించి ఎన్నో కథనాలు వింటున్నాం. ఈ ఆర్థిక నేరగాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొంతమంది అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బు దోచేస్తే, మరికొందరు డూప్లికేట్ ప్రొడక్ట్స్ తో బురిడీ కొట్టిస్తూ ఉంటారు. ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడుతూ బాధితులను లూటీ చేస్తున్నారు. వీటిపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా అమాయక ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కానీ ఈ మోసగాళ్ల విధి వక్రిస్తే… ఎక్కడో వారు చేసే ఓ చిన్న తప్పే అడ్డంగా బుక్కయ్యేలా చేస్తుంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను వంచించి, నగ్న వీడియోలు(Naked Videos) తీసి, వారి నుండి డబ్బు దొచేస్తున్న ఓ యువకుడి సీన్ రివర్స్ అయింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిప్లొమా పూర్త యింది.. జల్సాగా జీవించాలనే ఆశతో ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో యువతులను పరిచయం చేసుకుని, ప్రేమ పేరుతో నగ్న, అసభ్య వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడి సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. వరుసగా యువతులను నమ్మించి నగ్న వీడియోలు తీసి, బెదిరించి రూ. లక్షల్లో నగదు చేజిక్కించుకుంటూ చివరికి పోలీసులకు చిక్కాడు. ఏలూరు జిల్లా(Eluru District) ముదినేపల్లిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సై షణ్ముఖసాయి వివరాలు వెల్లడించారు.
ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం చేసుకుని చేతులు కోసుకుంటానని, తలను గోడకు కొట్టుకుంటానని బెదిరించి నగ్న వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తున్నాడని ముదినేపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన హైదరాబాద్ లో ఎంబీఏ చదువుతున్న విద్యార్ధిని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తుండగా సింగరాయపాలెం వద్ద గురువారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఫోన్ లో యువతిని బెదిరిస్తున్న వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District) జియ్యమ్మవలస మండలం బిట్రపాడుపల్లికి చెందిన మిరియాల నవీన్(25) పాలిటెక్నిక్ వరకు చదువుకున్నాడని తెలిపారు.
మహిళలతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకుని ఇలా బెదిరింపులకు పాల్పడి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడని వెల్లడించారు. నిందితుడిపై విశాఖ జిల్లా దువ్వాడ, మువ్వవానిపాలెం, పోతినమల్లయ్యపాలెం స్టేషన్లలో ఇతనిపై పలు కేసులు నమోదై బెయిల్ పై ఉన్నాడని చెప్పారు. మొబైల్ ద్వారా మరో పది మంది యువతులు ఇతని బాధితులుగా ఉన్నట్లు గుర్తించామని వివరించారు. యువతులు, విద్యార్థినులు మహిళలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఫొటోలు పెట్టవద్దని, పరిచయం లేని వారితో మాట్లాడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిందితుడిని కైకలూరు న్యాయస్థానానికి తరలించగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై వివరించారు.
Read Also: ఉభయ జిల్లాల రైతులకు ఆందోళన కలిగిస్తున్న గోదావరి.. కారణమేంటి?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat