జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. షోపియాన్ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో బలగాలు ద్రాగడ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి బలగాలు. భద్రతా సిబ్బందిని చూడగానే ముష్కరులు కాల్పులు చేశారని పోలీసులు తెలిపారు.
ప్రతిగా బలగాలు సైతం కాల్పులు జరపగా.. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. ఎదురు కాల్పుల సందర్భంగా ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు. వీరిని ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు. మృతి చెందిన ఉగ్రవాదులను గుర్తించే పనిలో పడ్డట్లు పోలీసులు తెలిపారు.