వివాహితతో ఎస్సై రాసలీలలు..భర్త సడెన్ ఎంట్రీ..చివరకు

Essay rasali with married..husband sudden entry.. finally

0
100

అతనో బాధ్యత గల ఎస్సై. ఇతరులు తప్పు చేస్తే చెప్పేది పోయి తానే తప్పు దారి పట్టాడు. ఏకంగా ఓ వివాహితతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. కానీ ఎస్సై ఆటలు ఎన్నో రోజులు సాగలేదు. అనుమానం వచ్చిన భర్త వారిని వదలలేదు. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో జరిగింది.

వనపర్తిలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. స్థానికంగా ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకుని చితకబాదిన ఘటన సంచలనంగా మారింది. షేక్ షఫీ వనపర్తి రూరల్ ఎస్ఐ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొంత కాలంగా వనపర్తికి సమీపంలోని కొత్తకోటకు చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెగ్యులర్ గా ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్న ఎస్ఐ షఫీ, భర్తలేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలలు సాగిస్తున్నాడు.

తాజాగా ఈ విషయం స్థానికులు, స్నేహితుల ద్వార ఆ వివాహిత భర్తకు తెలిసింది. దీంతో వాళ్లిద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకోవాలని ఆ భర్త పధకం వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి ఇంటికి సమీపంలోనే మాటు వేశాడు. ఇంకేముంది ఆ మహిళ తన ప్రియుడు ఎస్‌ఐ షఫీకి ఫోన్ చేయగా అతడు క్షణాల్లోనే ప్రియురాలి ఇంటికి వచ్చేశాడు. వాళ్లిద్దరు రాసలీలల్లో మునిగి తేలుతుండగా భర్త తన స్నేహితులతో కలిసి వెళ్లి, వారిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నాడు. స్నేహితులతో కలిసి ఎస్ఐ షఫీని ఆమె భర్త చితకబాదారు. అడ్డొచ్చిన భార్యను సైతం కొట్టారు.

ఈ విషయం బయట తెలిస్తే తన పరువు పోతుందని, తనను వదిలిపెట్టాలని ఎస్ఐ ప్రాధేయపడినా ఆవేశంలో ఉన్న వాళ్లంతా కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కొత్తకోట పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఎస్ఐని కాపాడి వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అతడిని హైదరాబాద్‌ కు తరలించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐ‌ షేక్ షఫీని సస్పెండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకును విచారణ చేపట్టారు.

https://www.facebook.com/alltimereport/videos/590205872033610