Breaking News- పేలిన ఫ్రిడ్జ్..భార్యాభర్తలు సజీవదహనం

0
82

ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలడం వల్ల దంపతులు సజీవదహనం అయ్యారు. ఒడిశాలోని కేందుఝార్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న సమయంలో ఫ్రిజ్ పేలినట్లు పోలీసులు తెలిపారు. మృతులను లక్ష్మీ, పూర్ణచంద్ర దెహూరీగా గుర్తించారు. దంపతులను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. భార్య భర్తలిద్దరూ మంటల్లో కాలిపోయారు. ఈ ఘటన నుంచి తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.