పేలిన ఫోన్..8 నెలల చిన్నారి దుర్మరణం

0
84

ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలడంతో ఓ చిన్నారి దుర్మరణం పాలయింది. ఈ దుర్ఘటన యూపీలోని బరేలీలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి  వదిలేశాడు. దీనితో బ్యాటరీ పేలి పక్కనే ఉన్న మంచానికి అంటుకున్నాయి. ఈ క్రమంలో మంచంలో నిద్రిస్తున్న 8 నెలల చిన్నారికి మంటలంటుకుని తీవ్రంగా గాయపడింది. దీనితో చిన్నారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.