పోలీసుల నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..పుట్టెడు దుఃఖంలో కుటుంబసభ్యులు

0
103

తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉన్న కూడా ట్రాఫిక్ పోలీసులు కనికరించకుండా డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన ఘటన యాదగిరిగుట్ట సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చలానా పెండింగ్ పేరుతో ఓ కారును అడ్డుకున్నారు.

దాంతో కారులో ఉన్న కుటుంబసభ్యులు తమ చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉందన్న వినకుండా చలానా కట్టి వెళ్లాల్సిందే అంటూ పోలీసులు తీవ్రంగా మండిపడ్డారు. దాంతో కుటుంబసభ్యులు పోలీసుల కాళ్ళుపట్టుకున్నా కనుకరించకుండా..అరగంట సేపు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగడంతో  మూడు నెలల చిన్నారి ఆరోగ్యం విషమించడంతో మృతిచెంబడినట్టు వైద్యులు వెల్లడించారు. దాంతో తల్లిదండ్రులు పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని రోదనకు గురయ్యారు.