కొన్ని నెలలుగా ఆ ఇంటికి తాళం – తెరిచి లోప‌ల‌ చూసి షాకైన కుటుంబ సభ్యులు

Family members shocked when they opened the door

0
114

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అమింజికరై రైల్వే కాలనీలో ఓ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. ఎందుకంటే ఇక్కడ ఓ ఇంటికి తాళం వేసి కొన్ని నెలలు అయింది. అది పాత ఇళ్లు కావడంతో అక్కడ ఎవరూ ఉండటం లేదు . ఆ ఇళ్లు మహేష్ ది ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరడంతో చాలాకాలం నుంచి తాళం వేసి ఉంచారు. ఇంటిని శుభ్రం చేయడానికి తాళం తీశారు. కాని ఆ ఇంటిలోపల ఏముందో చూసి షాక్ అయ్యారు.

తాళం తీసిన వెంటనే ఆ ఇంటి వరండాలో అస్థిపంజరం కనిపించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో తేలింది ఏమిటి అంటే? ఆ అస్థిపంజరం ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిదేనంటూ పోలీసులు నిర్దారించారు.

అస్థిపంజరం మహేష్ అన్న రమేష్ ది అని తేలింది. రమేష్ కారు డ్రైవర్ అతనికి పెళ్లి కాకపోవడంతో ఆ ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే అతను కొన్ని నెల‌లుగా కనిపించడం లేదు. దీంతో ఎక్కడికో వెళ్లి ఉంటాడు అనుకున్నారు . కాని ఇక్కడ చనిపోయినట్లు గుర్తించారు. దీనిపై ఇంకా లోతైన విచారణ చేస్తున్నారు పోలీసులు.