ఆ రైతులకు రైతుబంధు కట్?

0
83

గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు గంజాయి సాగు చేసే రైతులను గుర్తించింది.  గంజాయి పండిస్తున్న 148 మంది రైతుల్లో 121 మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేసింది. అంతేకాదు వారికి రైతుబంధు నిలిపివేయాలని ప్రభుత్వానికి అబ్కారీ శాఖ ప్రతిపాదనలు పంపింది. జూన్‌లో విడుదల చేయనున్న రైతుబంధును వీరికి ఇవ్వొద్దని లేఖలో కోరింది. ఆదిలాబాద్, నిజామాబాద్​, సంగారెడ్డి జిల్లాల్లో గంజాయి ఎక్కువగా సాగవుతున్నట్టు తెలుస్తుంది.