ఘోర బస్సు ప్రమాదం..27 మంది దుర్మరణం

0
86

చైనాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. గుయంగ్ నగరంలోని సండూ కౌంటీలో ఆదివారం ఉదయం ఓ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నట్లు సమాచారం. కాగా ఇందులో 27 మంది దుర్మరణం చెందగా..మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.