ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

0
144

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాపురం నుంచి కడప వైపు వెళ్తున్న ఆటోను ,కడప నుంచి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

దాంతో స్థానికులు తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.