రోజురోజుకు దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. డ్రైవింగ్ నిర్లక్ష్యం, తాగి వాహనాలు నడపడం, నిద్ర మత్తులో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం ఉదయం చెంగల్పట్టు ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో పది మంది ప్రయాణికులు గాయపడడినట్లు సమాచారం.