వివాహం చేసుకోవడానికి వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

0
116

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది ప్రాణాలు కోల్పోగా..తాజాగా శుక్రవారం కాకినాడ లోని పిఠాపురం బైపాస్ రోడ్డులో ప్రేమ వివాహం చేసుకునేందుకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యువతి, యువకులకు తీవ్ర గాయాలు కావడంతో  పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే యువకుడు మృతి చెందాడు. యువతికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..డిగ్రీ చదువుతున్న గణేష్, ఇంటర్ చదివిన దీప్తి ల మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ప్రేమ పెళ్లి కోసం బైక్ పై అన్నవరం వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం యువతి బంధువులే ఈ ఘటనకు కారణమని మృతుడు తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది. యువతి బంధువులే చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని పోలీస్టేషన్ లో మృతుడు తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.