Palnadu district: కూతురు అదే పనిగా ఫోన్ మాట్లాడుతోందని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏపీలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే రైతు కూతురు ఫోన్లో ఎక్కువగా గడుపుతుండటంతో చాలా సార్లు మందలించాడు. అలవాటు మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో ఆమె తండ్రికి తెలియకుండా రహస్యంగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఇదే క్రమంలో ఈరోజు కూడా ఎప్పటిలానే మేడపైకి వెళ్లి రహస్యంగా ఫోన్ లో మాట్లాడుతోంది. అది చూసిన ప్రసాద్ కోపంతో ఊగిపోయాడు. కూతురిపై చేయి చేసుకుని, నెట్టేశాడు. దీంతో ఆమె కిందపడి తీవ్ర గాయలపాలైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కూతురు రహస్యంగా అలా చేస్తోందని కన్నతండ్రి దారుణం
-