రోజులు చాలా మారాయి – అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు ఫైట్

Fight two girls for the boy

0
71

రోజులు చాలా మారాయి గతంలో అమ్మాయిల కోసం అబ్బాయిలు గొడవ పడిన ఘటనలు చూశాం. ఆ పిల్ల నాది నేను ప్రేమిస్తున్నాను నువ్వు సైడ్ తప్పుకో అని వార్నింగ్ ఇచ్చిన ఘటనలు, ఇరువురు తన్నుకోవడాలు ఇలాంటివి చాలా చూశాం. కాని ఇప్పుడు నిజంగానే రోజులు మారాయి. ఇప్పుడు అబ్బాయిల కోసం అమ్మాయిలు వీధిలో ఫైటింగ్ కు దిగుతున్నారు.

ఒక యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డు మీద జుట్టూజుట్టూ పట్టుకున్నారు. నడిరోడ్డు మీదనే సిగపట్లుతో కుస్తీ పట్టారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందని ఆలోచిస్తున్నారా మొత్తం తెలుసుకుందాం. ఝార్ఖండ్లోని సరాయకేలాలో జరిగింది ఘటన. ఈ సీన్ మొత్తం కొందరు స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటంతో వైరల్ గా మారింది.

ఆమె బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో కూడా తిరుగుతున్నాడు ఈ విషయం మొదటి అమ్మాయికి తెలిసింది. అంతేకాదు రోడ్డు మీద ఇద్దరూ కనిపించారు. ఆ అబ్బాయిని కాకుండా అమ్మాయిని ప్రశ్నించింది ఈ అమ్మాయి. నా బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నావని ప్రశ్నించింది. చివరకు ఇద్దరూ గొడవకు దిగారు. స్ధానికులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ ముగ్గురు కూడా అక్కడ నుంచి సైలెంట్ గా జారుకున్నారు.

https://twitter.com/i/status/1425859756460167169