Flash News : కత్తి మహేష్ మృతి

0
106

సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్ కొద్దిసేపటి క్రితం చెన్నైలో ఆసుపత్రిలో చికిత్స సొందుతూ మృతి చెందాడు. రెండు వారాలకు పైగా ఆయన మృత్యువుతో పోరాడారు. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం నుంచి హైదరాబాద్ వస్తుండగా మార్గ మధ్యలో నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు కత్తి మేహేష్. ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. పెట్రోలింగ్ పోలీసులు కత్తి మహేష్ ను గుర్తు పట్టి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయనను తొలుత నెల్లూరులో వైద్యం అందించారు.. కానీ మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించారు.

ఎపి ప్రభుత్వం కత్తి మహేష్ ఆసుపత్రి ఖర్చుల కోసం 17 లక్షల రూపాయలు మంజూరు చేసింది. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది. కానీ లాభం లేకుండాపోయింది. కత్తి మహేష్ ప్రాణాలు నిలబడలేదు.

తలకు బలమైన గాయాలు కావడం వల్ల కత్తి మహేష్ కోలుకోలేకపోయారు. ఆయనకు ఒక కన్ను పూర్తిగా తొలగించారు. కన్ను లేకుండా అయినా బతుకుతాడనుకున్న ఆయన అభిమానులకు నిరాశ తప్పలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.