Breaking: సిద్ధిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాల్పులు కలకలం

0
72

తెలంగాణ: సిద్ధిపేటలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. రిజిస్ట్రేషన్ కు వచ్చిన వ్యక్తి కాల్పులు జరిపి డబ్బులు లాక్కుని పరారయ్యారు. పాత ధరలతో రిజిస్ట్రేషన్ కు ఇదే చివరి రోజు కావడంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారు. ఈ క్రమంలోనే దుండగులు కాల్పులు జరిపి డబ్బులతో పరారయ్యారని తెలుస్తోంది. సుమారుగా రూ. 43.5 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. మాస్కులు ధరించి దుండగులు ఈ దోపిడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.