Flash: నిండు గర్భిణీని బలి తీసుకున్న అత్తింటి వేధింపులు..

0
85

తెలంగాణాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి శివారులోని భూరుగుంట తండా సమీపంలో ఏడు నెలల గర్భిణీ స్త్రీ కడుపులో బిడ్డతో సహా మృతి చెందింది. ఇంకొన్ని నెలల్లో ఈ లోకాన్ని చూసే భాగ్యం కలగకుండానే కడుపులోనే చంపేశారు కన్న తండ్రి. కారణం ఏంటంటే..భర్త, అత్తమామలు అబార్షన్ చేసుకోమని వేధించారు. దానికి ఆ గర్భిణీ నిరాకరించడంతో భర్త, అత్త,మామలు కొట్టి చంపి రాత్రి బావిలో పడేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదని బంధువులు కంటతడిపెట్టుకున్నారు.