హాస్పిటల్ లో అగ్నిప్రమాదం..డాక్టర్ సజీవదహనం..మరో ఇద్దరు..

0
102
Kabul

రోజురోజుకు అగ్నిప్రమాదాలు పెరిగిపోతున్నాయి. సరైన జాగ్రత్తలు లేకపోవడం, షాట్ సర్క్యూట్ వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఏపీలోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనిలో కార్తీక ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డాక్టర్ సజీవదహనం కాగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.