తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. ఈరోజు తెల్లవారుజామున మాదాపూర్ లో ముజీబ్ అనే వ్యక్తి ఇస్మాయిల్ అనే వ్యక్తిపై కాల్పులకు పాల్పడ్డాడు. దీనితో ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అసలేం జరిగిందంటే?
జాంగీర్ తెలిపిన వివరాల ప్రకారం..ల్యాండ్ సెటిల్మెంట్ డబ్బులకు పిలిచారు. మాదాపూర్ లోని ఇడ్లీ బండి దగ్గర రాత్రి 3: గంటల ప్రాంతంలో టిఫిన్ చేశాం. ఇస్మాయిల్, అహ్మద్ ముజాహిద్ మజాకు ఆడుకుంటూ గొడవ పెద్దగా అయింది. ముజాహిద్ వెంట తెచ్చుకున్న పిస్తోల్తో ఇస్మాయిల్ పై కాల్పులు జరిపారు. ఇస్మాల్ పైన ఐదు సార్లు కాల్పులు జరిపారు. దీనితో ఇస్మాయిల్ తల వెనుక భాగంలో రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి.
నేను అడ్డుకోవడానికి వెళ్లాను నాపై కూడా కాల్పులు జరిపారు. ఇస్మాయిల్ కింద పడడంతో తలకు బలమైన గాయాలు కావడంతో నేను కార్లో వేసి హాస్పిటల్ కు పంపించాను. ఇస్మాయిల్ మిత్రుడు సయ్యద్ ఫయాజ్ జహీరాబాద్ కు సంబంధించిన మూడు ఎకరాల భూమి వివాదం ఉంది. మూడెకరాల ల్యాండ్ పై ఇస్మాయిల్ అతని స్నేహితులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ల్యాండ్ జిలాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు ఇస్మాయిల్.
అప్పటినుండి వీరిద్దరి మధ్యలో భూ వివాదం సురువైంది. గత ఒప్పందాల ప్రకారం జిలాని ఉండకుండా మాట మార్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇస్మాయిల్, మహ్మద్ ముజాహిద్ జైల్లో పరిచయం. వీళ్ళిద్దరి పైన రౌడీషీటర్ ఓపెన్ ఉంది.