Flash News- మహారాష్ట్రలో ఎదురుకాల్పులు​..ఐదుగురు మావోయిస్టులు హతం

Five Maoists killed in clashes in Maharashtra

0
83

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు ఈ ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. అనంతరం ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.