జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో భద్రతాబలగాల కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్ టెర్రరిస్టులు(Five Terrorists) హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. కాగా, జూన్ 13వ తేదీన కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయని కశ్మీర్(Jammu Kashmir ) పోలీసులు తెలిపారు. దీంతో ఆర్మీ, కుప్వారా పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.