ఎవరి జీవితంలో అయినా బాల్యంలో ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. అవన్నీ ఎదిగిన తర్వాత తలచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మళ్లీ ఆరోజులు తిరిగిరావు కాబట్టి వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. స్కూల్, లేదా కాలేజ్లో ఒకరి టిఫిన్ దొంగిలించి తినడం. అవతల వారి ఫుడ్ తీసుకుని తిని బాక్స్ ఖాళీ చేయడం ఇలాంటివి మనం చూస్తు ఉంటాం.
ఒక వ్యక్తి తన టిఫిన్ దొంగను వెతకడానికి ఐదు సంవత్సరాలు గడిపాడు. తర్వాత నిజం తెలిసిన వెంటనే అతడిపై దాడి చేశాడు. ఐదు సంవత్సరాల క్రితం మాథ్యూ ఎవాన్స్ టిఫిన్ బాక్స్ కొట్టేశాడు. అందులోని సాసేజ్ రోల్స్ తిన్నాడు. ఈ విషయం గురించి ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత సర్దుమణిగింది.
ఇక మళ్లీ గతేడాది వారిద్దరూ ఈ విషయంపై గొడవ పడ్డారు. దీంతో టిఫిన్ కొట్టేసిన వ్యక్తి నేను దొంగతనం చేశా అని ఒప్పుకున్నాడు. వెంటనే మాథ్యూ ఎవాన్స్ కోపంతో అతడిపై కత్తితో దాడి చేశాడు. మాథ్యూకు 4 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి. ఈ కేసు గురించి తెలిసి ఇంత చిన్నదానికి ఇంత దాడి చేశాడా అని అందరూ షాక్ అవుతున్నారు.