పాపం ఎంత కష్టం వచ్చింది – ఆపరేషన్ కోసం దాచిన రూ. 2 లక్షలు ఎలుకల పాలు

The rat shredded the money

0
79

పాత బట్టలు వస్తువులు ఎలుకలు కొట్టేసిన ఘటనల గురించి మనం వింటాం. అయితే ఇక్కడ ఏకంగా ఓ వ్యక్తి ఆపరేషన్ కోసం దాచుకున్న నగదుని ఎలుకలు కొరికేశాయి. కడుపులో కణతికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు కూడబెట్టుకున్న 2 లక్షల రూపాయల సొమ్మును ఎలుకలు కొట్టేసి పనికిరాకుండా చేశాయి. పాపం ఆ వ్యక్తి ఆ కరెన్సీ నోట్లు చూసి కన్నీరు పెట్టుకున్నాడు.

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారులోని ఇందిరానగర్ కాలనీతండాలో ఉండే భూక్య రెడ్యా కడుపులో కణతి ఉంది. ఇటీవల ఆస్పత్రిలో అతనికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఈ ఆపరేషన్ కోసం నాలుగు లక్షలు అవుతుంది అని తెలిపారు. ఇలా కూరగాయల వ్యాపారం చేసే అతను ఆ డబ్బుని పొగేస్తున్నాడు.

కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొచ్చి మొత్తం రూ. 2 లక్షలను బీరువాలో భద్రపరిచాడు. ఆస్పత్రికి వెళ్లేముందు రెడ్యా బీరువాలోని డబ్బులను చూసి షాక్ అయ్యాడు. అందులో ఎలుకలు వాటిని ముక్కలు ముక్కలు చేశాయి.
ఆ డబ్బు ఇలా అవ్వడంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆ డబ్బును తీసుకుని గత నాలుగు రోజులుగా మహబూబాబాద్లోని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది.