మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌

Former Home Minister Anil Deshmukh arrested

0
85

మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్ట్ అయ్యారు. ముంబై కార్యాలయంలో 12 గంటల పైనే విచారించిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు. కోట్ల రూపాయలు లంచం డిమాండ్‌ చేశారని ఆరోపణలతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

దీంతో మనీలాండరింగ్‌ అంశంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటకీ కోర్టు తన పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే, ఇటీవల దేశ్‌ముఖ్‌ ఆస్తులపై ఈడీ దాడి చేసి పలు ఆస్తులను జప్తు చేసింది.

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది.