ఫ్లాష్: మాజీ ఎమ్మెల్యే ఇంట విషాదం..

0
95

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని తమ స్వగృహంలో ఈరోజు ఉదయం తాటి వెంకటేశ్వర్లు కూతురైన  మహాలక్ష్మి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ సభ్యులు గమనించడంతో.. భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ మధ్య కాలంలోనే మహాలక్ష్మి ఎంబీబీఎస్​ పూర్తి చేసింది. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకా ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.