ఇటీవల ఓ బాలికపై టీఆర్ఎస్ నాయకుడు అత్యాచారానికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యాచారానికి పాల్పడ్డ టీఆర్ఎస్ పార్టీ మాజీ నేత, నిర్మల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని కారు డ్రైవర్ జాఫర్ తో పాటు మధ్యవర్తి అనురాధను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సాజిద్ పై పోక్సోతో పాటు, అపహరణ, అత్యాచారం కేసులను నమోదు చేశారు.