Flash News- భారీగా గంజాయి పట్టివేత..నలుగురు అరెస్ట్

Four arrested for possession of cannabis

0
92

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. రెండు కార్లలో తరలిస్తున్న 462 కిలోల గంజాయిని ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని సమాచారం. గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి నుండి రెండు కార్లను సీజ్ చేశారు. నిందితులు గతంలో కూడా పలుమార్లు గంజాయి స్మగ్లింగ్​లో పాల్గొన్నట్లు ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.