కేరళలోని కొల్లాం జిల్లాలో దారుణం చోటు చేసు కుంది. ఓ వ్యక్తి..భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం కొట్టారకరలోని నీలేశ్వరంలోని ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు శవాలుగా కనిపించారు. మృతులు నీలేశ్వరానికి చెందిన రాజేంద్రన్ (55), అతని భార్య అనిత (50), పిల్లలు ఆదిత్య రాజ్ (24), అమృత (21)గా గుర్తించారు. రాజేంద్రన్ ఉరివేసుకుని మృతి చెందారు. అంతకుముందు భార్య, పిల్లలను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలేం జరిగి ఉంటుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు..అసలేం జరిగింది?
Four bodies in one house..what actually happened?