ఈమధ్య కొందరు చాలా విచిత్రమైన ప్రాంకులు డేర్లు చేస్తున్నారు. అయితే దాని వల్ల పబ్లిక్ కి ఏం ఉపయోగమో తెలియదు? కాని ప్రజలు మాత్రం వీరి ప్రాంకుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అరేయ్ అన్నా సారీ ఇది ప్రాంక్ అని చివరన సమ్మగా చెబుతున్నారు . కాని ఈలోపు పడాల్సిన దెబ్బలు పడుతున్నాయి. పోలీసులు ఎంటర్ అవుతున్నారు.
ఇటీవల ఓ వ్యక్తి ప్రాంక్ చేశాడు యూరప్ లోని .అది తన స్నేహితుడు ఇచ్చిన డేర్ .విలియం బ్యాంక్ ఏటీఎం దగ్గర నుంచి డబ్బులు డ్రా చేసే వ్యక్తి నుంచి పరసు దొంగిలించి పారిపోవాలి. మళ్లీ వచ్చి పరసు ఇవ్వాలి. ఈ సమయంలో ఓ ఏటీఎం దగ్గర కాండెల్ సెంటర్ లో ఇలాగే చేశాడు విలియం. అయితే అతను అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి.
కాండెల్ సిటీలో ఇలాంటి సంఘటనలు జరిగితే అస్సలు ఊరుకోరు. దొంగ దొంగ అని అరిస్తే వాడి వెనుక
ఉరుకులు ఇక్కడ అదే జరిగింది .అతనిని దాదాపు 20 మంది వెంబడించారు. సార్ ఇది ప్రాంక్ సార్ అని చెప్పే అవకాశం ఇవ్వలేదు. మనోడ్ని చితక్కొట్టారు. చివరకు ప్రాంక్ అని తెలిశాక మా టైమ్ వేస్ట్ అని అక్కడ నుంచి వెళ్లిపోయారు. సో ఇలాంటి ప్రాంక్ లు ఎందుకు బ్రదర్ అంటున్నారు ఇది తెలిసినవారు . అంతేకాదు మనోడికి బోనస్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది.