14 ఏళ్ల బాలుడిని హత్య చేసిన ఫ్రెండ్స్..కాళ్లు, చేతులు నరికి..

Friends kill 14-year-old boy by cutting off legs and arms

0
106

ఝార్ఘండ్​లో దారుణ ఘటన వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలుడిని అతని స్నేహితులే అతికిరాతకంగా హత్య చేశారు. అంతేకాదు కాళ్లు, చేతులు నరికి మృతదేహాన్ని సంచుల్లో పెట్టి అటవీ ప్రాంతంలో పడేశారు.

దేవ​ఘర్​ జిల్లా రోహిణి గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఒకరోజు బాధితుడిని అతని స్నేహితుడు మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన నివాసంలో కలిశాడు. ఇద్దరు కలిసి కుమ్రాబాద్​ స్టేషన్​ రోడ్​కు వెళ్లారు. అక్కడ వారిని అవినాశ్ అనే మరో స్నేహితుడు కలిశాడు. ముగ్గురు కలిసి పలంగా పహాడ్​ అటవీ ప్రాంతం వైపుగా వెళ్లారు. అక్కడే అవినాశ్​కు, బాధితుడికి మధ్య గొడవ జరిగింది.

గొడవ జరుగుతున్న క్రమంలోనే అవినాశ్​ తన వద్ద ఉన్న కత్తిని తీసి బాధితుడిని పొడిచాడు. గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత.. కాళ్లు, చేతులు నరికి శరీర భాగాలను మూడు సంచుల్లో పెట్టి అటవీ ప్రాంతంలో పడేశాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..అవినాశ్​ను అరెస్ట్​ చేశారు. నిందితుడు నేరం అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.