భర్తతో విసుగుచెంది రెండో పెళ్లి చేసుకున్న భార్య – భర్త ఎంత దారుణం చేశాడంటే

స్నేహం కాస్త ప్రేమగా మారింది

0
85

గుజరాత్ లో అహ్మదాబాద్లో ఓ దారుణం జరిగింది. అజయ్ ఠాకూర్, హేమ కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ముందు ఈ జంట చాలా ఆనందంగా ఉంది. అయితే కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. ఇద్దరు పిల్లలు ఉన్నా భర్త ప్రవర్తన ఆమెకి నచ్చేది కాదు. అతని నుంచి దూరంగానే ఉంటోంది. ఈ క్రమంలో భర్త భార్య విడివిడిగానే ఉంటున్నారు.

హేమ మహేష్ ఠాకూర్ అనే యువకుడితో స్నేహం చేసింది. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. దీంతో హేమ తన భర్త అజయ్ ఠాకూర్కు విడాకులిచ్చింది. ఇక పిల్లలని కూడా తండ్రి దగ్గర వదిలేసి ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుంది. దీంతో అజయ్ ఠాకూర్ మానసికంగా కుంగిపోయాడు.

తన ఇద్దరు పిల్లలను భార్య వదిలి వెళ్లడంతో వారిని ఎలా చూసుకోవాలో తెలియక బాధపడుతూ రోజూ తాగేవాడు. ఇక హేమని చంపాలి అని ప్లాన్ వేశాడు. అజయ్ ఠాకూర్ తన ఇద్దరి స్నేహితులను వెంటబెట్టుకుని హేమ, మహేష్ ఠాకూర్ నివాసం ఉంటున్నచోటుకి వెళ్లాడు. ఇక హేమ ఒంటరిగా ఇంటిలో ఉంది. హేమపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన హేమను అతని స్నేహితులు అడ్డుకున్నారు. చివరికి హేమను వెంటాడి 27 సార్లు కత్తితో పొడిచాడు. తర్వాత అక్కడ నుంచి ఆమె భర్త స్నేహితులు పారిపోయారు. ఇక భర్త ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.