సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటన పూర్తి వివరాలు – ఏ రోజు ఏం జరిగింది

Full details of the incident at Saidabad Singareni Colony

0
87

సైదాబాద్ సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని బాలికని అత్యాచారం చేసి చంపేశాడు దుర్మార్గుడు రాజు. అసలు ఇతను మనిషి కాదు మానవ మృగం అంటున్నారు అందరూ. అసలు ఈ కేసు ఏమిటి ఏం జరిగింది అనేది చూద్దాం.
నిందితుడి రాజు సొంత ఊరు నల్గొండ జిల్లాలోని చందంపేట మండలం. ఇక్కడ హైదరాబాద్ లో ఆటో నడుపుకుంటూ ఉన్నాడు. జులాయిగా తిరుగుతాడు. అతనికి వివాహం అయింది భార్యని కూడా కొడుతూ గొడవలు పెట్టుకుంటాడు. చివరకు ఇంటి నుంచి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

సెప్టెంబర్ 9వ తేదీన రాజు మాదన్నపేటలో భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు. సాయంత్రం 4.30 నుంచి 5 గంటల సమయంలో ఆ చిన్నారికి తినుబండారం ఆశచూపి ఇంటిలోకి తీసుకువెళ్లాడు.
చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. చివరకు అరవకుండా గొంతు నులిమి చంపేశాడు. ఏమీ తెలియనట్టు ఆ గదికి తాళం వేసి బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో ఫుల్లుగా తాగి ఉన్నాడు ఈ మైకంలో పానీ పూరీ తిన్నాడు.

ఇక బిడ్డ కనిపించడం లేదు అని తల్లి అనడంతో సింగరేణి కాలనీ వాసులందరూ పాప కోసం వెతుకుతున్నారు. రాత్రి 9 గంటలకు పాప కనిపించిందా అని పాప నాయనమ్మని అడిగాడు రాజు. వెంటనే ఆమె ఈ తాగుబోతుగాడు ఇలా ఎందుకు అడిగాడు అని ఇంట్లో వారికి చెప్పింది, ఇక పాప చెవికి ఉన్న బంగారు దుద్దుల కోసం ఆమెని ఏమైనా చేశాడా అనే అనుమానం కుటుంబ సభ్యులకి వచ్చింది. ఇక రాజు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.

రాత్రి 9 గంటలకు స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు రాజు ఉంటున్న గది వద్దకు వెళ్లారు. తలుపు బద్దలు కొట్టలేదు చివరకు రాత్రి 12 గంటల తర్వాత తాళం బద్దల కొట్టారు. చివరకు పాప మృతదేహం కనిపించింది. ఆరోజు నుంచి పోలీసులు అతని కోసం వెతుకులాట మొదలుపెట్టారు. సెప్టెంబర్ 15న రాజు ఆచూకీ తెలిపితే రూ.10లక్షలు బహుమతి ఇస్తామని సీపీ అంజనీకుమార్ ప్రకటించారు. చివరకు రాజు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.