ఉత్తర్ప్రదేశ్ మథురలో ఘోరం జరిగింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. రేప్ చేసిన తర్వాత.. మహిళ కాళ్ల పైనుంచి బైక్ను పోనిచ్చారు. అనంతరం బాధితురాలిని అడవిలో పడేశారు. ఈ ఘటన మే 24న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.