Flash: దారుణం..మేడ్చల్ జిల్లాలో మహిళపై గ్యాంగ్ రేప్..

0
78

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా తెలంగాణాల రాష్ట్రంలో ఘోర దారుణం చోటుచేసుకుంది.

ఓ మహిళపై నలుగురు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి మాయమాటలు చెప్పి నమ్మించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ లో చోటుచేసుకుంది. సోలాపూర్ నుంచి రెండు రోజుల కిందట దుండిగల్ కు బ్రతుకు తెరువుకు వచ్చిన మహిళను నిన్న రాత్రి గండిమైసమ్మ ప్రాంతంలోని వెనక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.