Breaking News: తెలంగాణలో మరో దారుణం

gang-rape of a young woman

0
87

హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటన మరవకముందే తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. మనిషి రూపంలో ఉన్న నలుగురు మృగాలు ఓ యువతిపై కన్నేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించిన నలుగురు యువకులు, స్థానికంగా ఉన్న రూమ్ కు తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.