యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు యువకులు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు నిందితులు. అనంతరం అక్కడి నుంచి ఆ ముగ్గురు యువకులు పారిపోయారు. ఈ సంఘటన మోదీనగర్ పట్టణంలో చోటు చేసుకుంది.