గ్యాస్‌ లీక్‌ కలకలం..నలుగురు కార్మికులకు తీవ్ర అస్వస్థత

0
81

ఏపీలో గ్యాస్‌ లీక్‌ కలకలం రేపింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెంలో ఇమామి ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో విష వాయువు లీక్ అయింది. అదే సమయంలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైనేజీ కాలువ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీక్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.